Anantapur

Jan 19 2024, 07:26

మండల స్థాయి శిక్షణా కార్యక్రమానికి హాజరై నమండల అధ్యక్షులు గౌరవ శ్రీమతి దాసరి సునీత

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక 2024-25 సంవత్సరం లో చేపట్టబోవు ప్రాధాన్యత గల పనుల వివరములు గురించి

ప్రణాళిక తయారీ గురించి మండల స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు గౌరవ శ్రీమతి దాసరి సునీత గారు, మండల ప్రత్యేక అధికారి శ్రీమతి B.N శ్రీదేవి గారు , గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, EOPR&RD శ్రీమతి దామోదరమ్మ గారు,పరిపాలనధికారి

శ్రీమతి A.శ్రీవాణి గారు, మండల స్థాయి అధికారులు,పంచాయితీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ , ఎకాలాజికల్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ శివశంకర్ గారు రిసోర్స్ పర్సన్ శ్రీ సుబ్బరాయుడు గారు హాజరైనారు.

Anantapur

Jan 19 2024, 07:27

నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి.. ఘన నివాళులర్పించిన ఆలం వెంకట నరస నాయుడు..

తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా నిలిపిన మహా మనిషి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కీ.శే నందమూరి తారక రామారావు గారు.. శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కేంద్రం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర *రాష్ట్ర కార్యదర్శి ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారు సూచన మేరకు* *జిల్లా నాయకులు* *ఆలం వెంకట నరసా నాయుడు*గారి* ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రేడ్డు పంపిణి చేసిన జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు ఈ సందర్బంగా ఆలం వెంకట నరసానాయుడు గారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు మరణం లేని మహారాజుగా వెలుగొందుతున్నారని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని కొనియాడారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు పక్కా గృహాలు రెండు రూపాయలకే కిలో బియ్యం, చీర దోవతి కార్యక్రమాలను తీసుకొచ్చిన ఘనత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కి దక్కుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జులు బూత్ కమిటీలు గ్రామ కమిటీలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Anantapur

Jan 19 2024, 07:09

బుక్కరాయసముద్రం మండల కేంద్రం లో స్వర్గీయఎన్టీఆర్ 28వవర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు

స్వర్గీయఎన్టీఆర్ 28వవర్ధంతి సందర్భంగా.... శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ మరియు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులా ఆధ్వర్యంలో NTR చిత్రపటంకు పూలమాలవేసి నివాళులర్పించిన టిడిపి *ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు యం.యస్.రాజు, సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బుక్కరాయ సముద్రం మాజీ జెడ్పిటిసి కె.రామలింగా రెడ్డి, పార్లమెంట్ అధికార ప్రతినిధిపర్వాతనేని శ్రీధర్ బాబు , మండల కన్వీనర్ అశోక్ కుమార్* .

ఈ కార్యక్రమంలో ఎస్. నారాయణస్వామి, కేసన్న, లక్ష్మీనారాయణ, రైతు సంఘం ఉపాధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, మాజీ MPP SK వెంకటేష్,

అనిల్ చౌదరి,మాజీ ఎంపీటీసీనారాయణస్వామి, తెలుగు యువత నాయకులు నరేంద్ర యాదవ్, మాజీ సర్పంచ్ మల్లేష్, రామనాయుడు, రంగమ్మ, వలి, బాబయ్య, హరి, అక్కులప్ప,రామకృష్ణారెడ్డి, నాయుడు,మరియు పెద్దయేతున్న మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Anantapur

Jan 19 2024, 06:50

హై టెన్షన్ తెర దింపిన జగనన్న.. సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా యం. వీరాంజనేయులు..

జగనన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి...

సామాజిక సమీకరణలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తగా యం. వీరాంజనేయులు(మాదిగ)సామాజిక సమీకరణలో భాగంగా.. శింగణమల మండలం సి. బండమీద పల్లి గ్రామానికి చెందిన యం. వీరాంజినేయులు(మాదిగ)ను సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించింది.

ఎమ్మెల్యే దంపతుల సహకారంతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నూతన సమన్వయకర్త ఎంపిక.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పును స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యం. వీరాంనేజియులను జగనన్న సమన్వయకర్తగా నియమించడం హర్షిస్తున్నామన్నారు. సమన్వయకర్తగా నియమించిన యం.వీరాంనేజియులుకు సహకరిస్తామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. 

సమన్వయకర్తగా ఎంపిక చేసిన జగనన్నకు రుణపడి ఉంటాము: యం. వీరాంజినేయులు (మాదిగ)*

సామాజిక సమీకరణలో భాగంగా శింగణమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనను ప్రతిపాదించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి, ప్రభుత్వం విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి రుణపడి ఉంటానన్నారు.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేస్తానన్నారు. 

తనను సమన్వయకర్తగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Anantapur

Jan 18 2024, 07:53

Breaking...విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకులు దుర్మరణం.. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు

అనంతపురం జిల్లా నార్పల మండలం నరసాపురం గ్రామ సమీపంలో హెచ్ ఎల్ సి కెనాల్ దగ్గర జంగారెడ్డి పల్లి దారి నందు

తెల్లవారుజామున తండ్రి భయపరెడ్డి 36 సంవత్సరములు కొడుకు రాజారెడ్డి 17 సంవత్సరములు ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు

ఈ ఇరువురు తమ పొలానికి నీళ్లు అందించడానికి వెళ్లి కొడుకు రాజారెడ్డి మోటర్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ కు గురైన వెంటనే తండ్రి భయపరెడ్డి రక్షించాలని వెళ్లి ఒకరికొకరు విద్యుత్ షాక్ ప్రమాదానికి గురై అక్కడే మరణించారు శోకసముద్రంలో కుటుంబ సభ్యులు

Anantapur

Jan 17 2024, 17:09

హెల్తీ గ్రామపంచాయతీ.. నేషనల్ వర్క్ షాప్ ఎంపీ కైన.. నీలం భాస్కర్ బుక్కరాయసముద్రం మండలం

హెల్తీ గ్రామపంచాయతీ.. నేషనల్ వర్క్ షాప్ లో పాల్గొననున్న జడ్పిటిసి నీలం భాస్కర్..

తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రేపు అనగా 18-01-2024 - 19 -01-2024 తేదీల్లో రెండు రోజుల పాటు హెల్తీ గ్రామపంచాయతీ..

నేషనల్ వర్క్ షాప్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా తరుపున బుక్కరాయసముద్రం మండలం జడ్పీటీసీ నీలం భాస్కర్ ఎంపిక చేశారు.

ఈ నేషనల్ వర్క్ షాప్ కి పలు రాష్ట్రాల నుంచి జిల్లా అధికారులు మండల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

Anantapur

Jan 17 2024, 12:19

బుక్కరాయసముద్రం గ్రామంలోని జగనన్న లే అవుట్ 6 లో 47వీధి దీపాలు వెలిగేనా.. సిపిఎం
విద్యుత్ కనెక్షన్ పై అవగాహన ఉన్న అధికారులేనా ! వీధి దీపాలు వేసింది 70 కు పైగా వెలుగుతున్నవి 23* *వెలగనివి 47* *వృత్తి నైపుణ్యం అంటే ఇదేనేమో* *కరెంట్ లేని లైన్ లకు వీధి దీపాల కనెక్షన్ ఇస్తే వెలుగుతాయా* *స్తంభం నెంబర్ 173 నుండి 172,171,170 వరకు ఉన్న స్తంభాలకు కాసారాలకు పింగాణీ లేక వైర్లు వేలాడుతున్న పట్టని అధికారులు.* *విద్యుత్ అధికారుల వైఫల్యమా* *పంచాయితీ నిర్వహణ వైఫల్యమా* *మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం గ్రామపంచాయితీ పరిధిలో లేఅవుట్ నెంబర్ 6 లో దాదాపు 800 కు పైగా ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. ఇల్ల నిర్మాణాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వము ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేస్తున్నది.* *అందులో భాగంగా లేఅవుట్ నంబర్ 6 నందు నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి దాదాపు 150 పైగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.* *వీటికి పంచాయతీ వీధి దీపాలను ఏర్పాటు చేసి నెల రోజులకు పైగా అయింది.* *వీధిదీపాలలో 47 కు పైగా వెలగని పరిస్థితిలో ఉన్నాయి.* *కారణం విద్యుత్ అధికారులు పంచాయితీ అధికారుల వైఫల్యమా, విద్యుత్ అధికారుల వైఫల్యమా? ఎవరనేది తెలియక ప్రజలు రాత్రి పూట వెలుగులు చూడలేక పోతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో ఏర్పాటు చేసిన నాలుగు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి నాలుగు ఫేస్ కనెక్షన్లు ఒక న్యూటన్ లైన్లతో ఏర్పాటు చేశారు.* *ట్రాన్స్ఫార్మర్ నుంచి మూడు ఫేసులకు మాత్రమే కనెక్షన్ ఇచ్చారు.* *ఒక ఫేసుకి కనెక్షన్ ఇవ్వకపోవడం వాటికే వీధి దీపాల కనెక్షన్ ఇవ్వడం అధికారుల పని తీరు శహబాస్ అవురా అని ముక్కున వేలేసుకుంటున్నారు. వీథి దీపాల వెలగకపోవడానికి కారణాలు దొరకడం లేదు.* *విద్యుత్ అధికారులు నాలుగో ఫేస్ కూడా విద్యుత్ కనెక్షన్ ఇస్తే తప్ప ఆ వీధి దీపాలు వెలగవు.* *మొత్తం వీధి దీపాలన్నీ నిత్యము వెలగడం కూడా జరుగుతుంది.* *ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల పంచాయితీకి వీధిదీపాల విద్యుత్ కరెంటు భారంగా మారుతుంది.* *అలాగే 173, 174 స్తంభాల దగ్గర ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుండి తూర్పు వైపున 172,171,170 స్తంభాల మధ్య కాసారాలపై ఉండాల్సిన పింగాణి లేకపోవడం వల్ల విద్యుత్తు లైన్లో క్రింద వేలాడుతున్నాయి. ఈ విషయమై సిపిఎం మండల నాయకులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడం బాధాకరం.* *283 స్తంభం కు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుంచి అక్కడ ఉన్న ఇళ్లకు స్తంభాలకు తీగలు లాగ లేదు. దీనివల్ల ఇల్లు నిర్మించుకుంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.* *తక్షణం గ్రామ పంచాయితీ అధికారులు స్పందించి విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకొని వీధి దీపాలు వెలిగేటట్లు, పింగాణీలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను క్రమబద్ధీకరించాలని 283 స్తంభం కు ఏర్పాటు చేసిన నాలుగోవ ట్రాన్స్ఫార్మర్ వద్ద నుండి మిగిలిన అన్ని సందులకు విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఆర్. కుళ్ళాయప్ప కోరారు.*

Anantapur

Jan 17 2024, 10:28

శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు గా కాయల సురేష్ యాదవ్..
తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలంనరసానాయుడు* గారి ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ గార్ల* చేతులమీదుగా *శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు గా కాయల సురేష్ యాదవ్ నియామకం పత్రాన్ని* ఈరోజు అనంతపురం పార్లమెంట్ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా తెలుగు యువత అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో యువత పాత్ర చాలా కీలకం ప్రతి ఒక్క యువ ఓటర్లను ఓటర్లుగా చేర్పించి ఆ ఓటర్లను చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో *దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, దండు సతీష్ రాయల్, దండు ప్రకాష్,ఐటిడిపి చాంపియన్ ముని,బాబావలి, మహ్మద్* తదితరులు పాల్గొన్నారు

Anantapur

Jan 17 2024, 07:37

ఆదర్శ కవికి ఆత్మీయ సన్మానం చేసిన మాజీ మార్కెట్ యార్డ్ శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ

ఆదర్శ కవి ఎన్నో అవార్డులు గెలుచుకున్న అవార్డు గ్రహీత

మన నార్పల మండల నివాసి శ్రీ వల్లెపు వెంకట సాయినాథ్ గారికి గౌరవనీయులు మాజీ మార్కెట్ యార్డ్

శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ గారు

ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది

Anantapur

Jan 17 2024, 07:18

గుడి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం

సిద్దారంపురం గ్రామంలో నూతనంగా సొంత ఖర్చుతో నిర్మిస్తున్న

శ్రీ విశాలాక్షి అమ్మవారి గుడి నిర్మాణ పనులను పరిశీలించిన

జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు..